సంక్షేమం సభలో డబుల్ బెడ్ రూమ్ సెగ..

నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత అధికారం చేపట్టి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలో అడుగు పెడుతూ ప్రభుత్వపరంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుతోంది ఈ ఉత్సవాల్లో భాగంగా జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ మండల కేంద్రంలోని మైథిలి ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గస్థాయి సంక్షేమం సభ ఏర్పాటు చేశారు. ఈ సభ జుక్కల్ ఎమ్మెల్యే అనుమంతుసిందే అధ్యక్షతన జరిగింది ఇట్టి సభలో ఒక ఒంటరి మహిళ మైక్ పట్టుకొని మాట్లాడుతూ.. ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది కానీ ఉండటానికి ఇల్లు లేదు డబుల్ బెడ్ రూమ్ మంజూరు కావడంలేదని ఇల్లు లేక ఆందోళన పడుతున్నట్లు డబుల్ బెడ్ రూమ్ మంజూరు గురించి ఆ మహిళా లేవనెత్తుతూ సంక్షేమం సభలో డబుల్ బెడ్ రూమ్ సెగ వినిపించారు. వెంటనే ఎమ్మెల్యే హనుమంత్ సిండే కల్పించుకుని అమ్మ చాలు నీ మాటలు ఇక వెళ్ళు అంటూ మాట్లాడకుండా పంపించి వేశారు జుక్కల్ నియోజకవర్గం లో మద్నూర్ డోంగ్లి బిచ్కుంద జుక్కల్ పెద్ద కోటప్గల్ పిట్లం నిజాంసాగర్ ఏడు మండలాలు ఉన్నాయి కాన్స్టెన్సీ సంక్షేమం సభకు ఏడు మండలాల నుండి భారీ ఎత్తున మహిళలు పురుషులు తరలివచ్చారు. సభా ముగింపు అనంతరం భోజనాలకు వెళ్తే అక్కడ అన్నం సరిపోక కాలి ఇస్తారులతో అన్నం కోసం మహిళలు ఎదురు చూడవలసిన దుస్థితి ఏర్పడింది ఇక జుక్కల్ ఎమ్మెల్యే సభలో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత తొమ్మిది ఏళ్ల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ ప్రతి ఇంటికి ఒక పథకాన్ని తప్పకుండా పొందుతున్నామని అలాంటి సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించే ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరొక్కసారి అధికారం కోసం ఆదరించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా జడ్పీ సీఈవో సాయ గౌడ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ద ఫెదర్ రాజు మద్నూర్ ఎంపీపీ వాగుమారే లక్ష్మీబాయి మండల జెడ్ పి టి సి అనిత స్థానిక సర్పంచ్ సురేష్ మద్నూర్ సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ డోంగ్లి సింగల్ విండో చైర్మన్ ఉమ్మడి నిజాంబాద్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ రామ్ పటేల్ మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ దిగంబరావ్ పాటిల్ బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బన్సీ పటేల్ ఆత్మ కమిటీ చైర్మన్ కొండ గంగాధర్ ఆయా మండలాల ఎంపీపీలు జడ్పిటిసిలు సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు మద్నూర్ తాసిల్దార్ అనిల్ ఎంపీడీవో రవి స్వర్గౌడ్ వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు ఆయా మండల్ అధికారులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.