ఎంసీఐ(యు) గ్రేటర్ కార్యదర్శి రమేష్
నవతెలంగాణ-మియాపూర్
అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని ఎంసీఐ(యు) గ్రేటర్ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో శేరి లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ విద్యా, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, కూడు గూడు కనీస అవసరాలు లేని ప్రజలు దేశ జనాభాలో ఇంకా 40 శాతం ఉండడం బాధాకరం అన్నారు. స్వతంత్రం వచ్చిన 75 ఏండ్లు గడిచినా దీనికి కారణం ప్రభుత్వా లే అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను నాశనం చేస్తోందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యో గాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిం దన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలు, రియల్ ఎస్టేట్ దందాలతో బీఆ ర్‌ఎస్ పాలన కూరుకుపోయిందని ఆరోపిం చారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో వనం సుధాకర్, తుడుం అనిల్‌కు మార్, పల్లె మురళి, ఇ.దశరథ నాయక్, తాండ్ర క ళావతి, డి.నర్సింహా, జి.లావణ్య, జి.శివాని, సుల్తానా బేగం, రంగస్వామి, ఇసాక్, లలిత, శ్రీనివాస్, అరుణ, ఏ.రమేష్, దయమని, తదితరులు పాల్గొన్నారు.