టీవీవీపీ జేఏసీ చైర్మెన్‌గా డాక్టర్‌ వినయ్ కుమార్‌

నవతెలగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) చైర్మెన్‌గా డాక్టర్‌ వినరు కుమార్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం జేఏసీ నాయకులు డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులకు ట్రెజరీ నుంచి జీతాలు ఇస్తున్నట్టుగానే తెలంగాణలోనూ ట్రెజరీ జీతాలు సాధించడమే తమ లక్ష్యమని తెలిపారు.