భగీరథతో ప్రతి ఇంటికీ తాగునీరు

ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌ రెడ్డి, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి
నవతెలంగాణ-పరిగి
మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అంది స్తున్నామని ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మండలం జాఫర్‌ప ల్లి గ్రామంలోని రాష్ట్ర ఆదర్శ పాఠశాల, కళాశాలలో మం చి నీళ్ల పండగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్ర మంలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి, కలెక్టర్‌ నారాయణ రెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో తాగునీటి కోసం బోరుబావుల చుట్టూ తిరిగి ప్రజలు చాలా ఇబ్బందు లు పడ్డారని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి గ్రామంలోని ఇంటింటికీ భగీరథ ద్వారా శుద్ధిచేసిన తాగునీరు అందించారన్నారు. వర్షాకాలంలో నీళ్లు కలుషితమై ప్రజలు అనారోగ్యం పాలయ్యే వారని, వేసవిలో బిందెడు నీళ్ల కోసం మహిళలు ఎన్నో అవస్థలు పడేవారన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ముఖ్యమంత్రి కృషి వల్ల ఎంతో దూరంగా ఉన్న గోదావరి కృష్ణా జలాలను రప్పించి, భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధి చేసిన జలాలను ప్రతిరోజూ సరఫరా చేస్తుం దన్నారు. ఎప్పుడైనా నీటి సరఫరాలో అంతరాయం తలెత్తి నప్పుడు భగీరథ ఇంట్రా, గ్రిడ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కరిస్తామన్నారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ జీవ కోట కి ముఖ్య ఆధారం నీరని, తిండి లేకుండా ఉండొచ్చని కానీ నీరు లేకుండా ఉండలేమన్నారు. ప్రజల నీటి కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వందల కిలోమీటర్ల దూరం నుండి నీటిని తెచ్చి వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌లో శుద్ధి చేసి ప్రజలకు నాణ్యమైన తాగునీటిని ప్రతిరోజూ అందిస్తుంద న్నారు. జిల్లాలోని 20 మండలాల్లోని ప్రతి ఇంటికీ నిరం తరంగా భగీరథ ద్వారా నీరు అందిస్తామన్నారు. గతంలో వేసవికాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్య ఉండేదని, వాటి పరిష్కారానికి అధికార యంత్రాంగం ఎంతో ఇబ్బం దులు పడేవారని,గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు అం దించేవారమని గుర్తుచేశారు. భగీరథ నీటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు చాలామంది గ్రామాలు పట్టణాలలో ఆర్‌ఓ.వాటర్‌ బాటిల్‌ లను వినియోగించడం జరుగుతుందన్నారు. ఆర్‌ఓవాట ర్‌లో మినరల్స్‌ శాతం తక్కువగా ఉండటంవల్ల కీళ్ల నొప్పు లతో పాటు జీర్ణ వ్యవస్థపై ఎక్కువగా ప్రభావం ఉంటుం దన్నారు. ఒకప్పుడు నల్లగొండ జిల్లాలో బోరు బావుల అప రిశుభ్ర నీటిలో ఫ్లోరోసిస్‌ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఆ నీరు తాగి ఫ్లోరోసిస్‌ బారిన పడి కీళ్లకు సంబంధించిన ఎ న్నో అవస్థలు పడే వారిని, ప్రస్తుతం మిషన్‌ భగీరథ ద్వారా శుద్ధి చేసిన మీరు ఆరోగ్యానికి మంచివన్నారు. నయా పై సా ఖర్చు లేకుండా ఇంటి ముందుకు వచ్చే నీటిని ప్రతి ఒక్క రూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ రోజు వాటర్‌ ప్లాంట్‌ను సందర్శించిన వారందరూ నీటి శుద్ధి ప్రక్రియను గ్రామీణ ప్రజలకు తెలిపి అందరూ భగీరథ నీటిని విని యోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు. కార్య క్రమంలో భగీరథ యస్‌ఈ ఆంజనేయులు, పరిగి నియోజ కవర్గం ప్రత్యేక అధికారి, డీపీఓ తరుణ్‌కుమార్‌, ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ ప్రవీణ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ముకుందఆనంద్‌, వివిధ మండలాల ప్రజాప్రతి నిధులు మండల ప్రత్యేక అధికారి దీపారెడ్డి, ఎంపీడీవోలు, డివిజనల్‌ పంచాయతీ అధికారి అనిత, ఎంపీఓలు, జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు తది తరులు పాల్గొన్నారు.