పాఠశాలలో తాగునీరు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలి

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన సర్పంచ్‌, చైర్మన్‌
నవతెలంగాణ-పెద్దేముల్‌
పెద్దేముల్‌ ఎంపీపీఎస్‌ పాఠశాలలో తాగునీరు సౌక ర్యం, మూత్రశాలలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారని, వెంటనే ఉన్నత అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పెద్దేముల్‌ సర్పంచ్‌ ద్వావరి విజయమ్మ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీపీఎస్‌ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నర్సింహు య్య ఆధ్వర్యంలో సర్పంచ్‌ ద్వావరి విజయమ్మ, పాఠశాల చైర్మన్‌ సిహెచ్‌, రాములు విద్యార్థులకు అక్షరాభ్యాసంతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ..ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య బోధన ఉపాధ్యాయులు అందిస్తున్నారన్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం ద్వారా ప్రతి తరగతి గదిలో ఫ్యాన్‌తో పాటు విద్యార్థులు కూర్చోవడానికి ప్రభుత్వం ద్వారా బెంచీలు వచ్చాయన్నారు. పాఠశాలలో ఫ్యాన్స్‌, బెంచులు రావడంతో సర్పంచ్‌, చైర్మన్‌, పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఉన్నత అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్‌ రెడ్డి, నర్సిరెడ్డి, రాధ, సంగీత, నపీజ్‌ సుల్తానా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.