నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలంలో విజయదశమి పండుగను మంగళవారం నాడు మండల ప్రజలు ఉత్సవంగా ఆనంద ఉత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. దసరా పండుగ రోజున మహిళలు ప్రత్యేకంగా తవ్వా పూజించే పూజలు గ్రామంలోని రహదారుల పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో విజయదశమి పండుగ సోమవారం నాడు జరుపుకోవాలని రాష్ట్ర సరిహద్దు మహారాష్ట్ర బార్డర్ లో గల మద్నూర్ మండలంలో మహారాష్ట్ర పద్ధతిన మంగళవారం రోజున విజయదశమి పండుగ జరుపుకున్నారు. విజయదశమి పండుగను పురస్కరించుకొని ప్రత్యేకంగా తవ్వా పూజించే పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది.