– జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఓటరు జాబితాలను రూపొందించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, విధి విధానాలపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బూత్ స్థాయి అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటల్లాడుతూ ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులపై సంబంధించి తగు ఆధారాలతో చర్యలు తీసుకోవాలన్నారు. బూత్ స్థాయి అధికారులు ఎన్నికల విధులను బాధ్యతగా సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఓటర్ జాబితా సవరణలో మార్పుల విష యంలో బూత్ స్థాయి అధికారులది కీలకపాత్ర అన్నారు. ఈ నెల 19 నుండి 22 వరకు మండలాల వారీగా బూత్ లెవల్ అధికారుల విధివిధానాలపై శిక్షణ ఇవ్వ నున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి విజరుకుమారి, డీఈఓ రేణుకాదేవి, తహసీ ల్దారు, తదితరులు పాల్గొన్నారు.