ఎకో ఎలిజీ

వెలుగుల పలకపై
ఎవరెవరో
చీకటిని చల్లుతుంటారు

పలకను వెతుకుతూ
వెన్నెల కాటుకాలిసిపోతుంది

కాటుకలిసిన వెన్నెలను గుర్తించక
కాలుతున్న అరణ్యాలు
ఎప్పటిలా పరుగులు పెడుతుంటాయి

గమ్యాలు తెలియకున్నాయి
అరణ్యాలు కాలుతున్నాయి
వెన్నెల
కాటుకలిసిపోతోంది
దిక్కు తోచక వెలుగు పలక
తనపైకి
చీకటిని లాక్కుంటోంది దుప్పటిలా
– ఫణిమాధవి కన్నోజు
7659834544