హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు

ED searches again in Hyderabadహైదరాబాద్‌:హైదరాబాద్‌ నగరంలో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్‌, మణికొండ పంజాగుట్టలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 15 బృందాలతో సోదాలకు బయలుదేరిన ఈడీ అధికారులు ఏక కాలంలో పలువురి ఇండ్లల్లో సోదాలు చేస్తున్నారు. మాలినేని సాంబశివరావుతోపాటు పలువురు ఇండ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. మాలినేని సాంబశివరావు ప్రస్తుతం నాలుగు కంపెనీలకు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ట్రాన్స్‌ ట్రై పవర్‌ ప్రాజెక్ట్‌, టెక్నో యూనిట్‌ ఇన్ఫ్రా టెక్‌, కాకతీయ క్రిస్టల్‌ పవర్‌ లిమిటెడ్‌, ట్రాన్స్‌ ట్రై రోడ్డు ప్రాజెక్ట్‌లకు సాంబశివరావు డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే బ్యాంక్‌ల నుంచి లోన్‌ తీసుకొని ఈ సంస్థలు ఎగ్గొటినట్టు తెలుస్తోంది.