– చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-శంకర్పల్లి
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడానికి శాయశక్తుల కృషి చేస్తున్నట్టు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శనివారం శంకర్‌పల్లి మండలంలోని గాజులగూడ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. చెవిలియోగంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పిటిసి గోవిందమ్మ గోపాల్ రెడ్డి, ఎంపీడీఓ వెంకయ్య వివిధ శాఖల ఏఈలు యుగంధర్ రాజు, గాజుల గూడా గ్రామ సర్పంచ్ చాట్ల శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ సంగం జిల్లా అధ్యక్షుడు మిర్జాగూడ గ్రామ సర్పంచ్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పాపారావు, కురుమ వెంకటేష్, సొసైటీ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.