టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి

– జాతీయ కార్యదర్శి కాసాని విరేష్‌
– ఎస్టీ సెల్‌ ప్రమాణ స్వీకారం
నవతెలంగాణ-హైదరాబాద్‌
టీడీపీని బలోపేతం చేయడానికి అన్ని అనుబంధ విభాగాలు పట్టుదలతో పనిచేయాలని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి కాసాని విరేష్‌ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆ పార్టీ అనుబంధ విభాగమైన ఎస్టీ సెల్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్లో నిర్వహించారు. ఆ విభాగం నూతన అధ్యక్షుడుగా కె.గోపి ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా కాసాని విరేష్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ అదివాసుల దినోత్సవ గిరిజన విభాగం నూతన కమిటీ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. గిరిజనుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర టీడీపీదని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ హయాంలో రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల వెల్లువ నడిచిందన్నారు. రాజకీయ, సామాజిక మార్పుకు నాంది పలికారని అభిప్రాయపడ్డారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అన్నారు. గిరిజన ప్రాంతాల్లో పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా మీరు మంచి నాయకులుగా గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు అజ్మీరా రాజునాయక్‌, ఆరీఫ్‌, జీవీజీ నాయుడు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులు పెద్దోజు రవీంద్రచారి, మండూరి సాంబశివరావు, బిక్షపతి ముదిరాజ్‌, రేజండ్ల కిషోర్‌, తెలుగు మహిళా అధ్యక్షురాలు షకీలారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్‌ అధ్యక్షులు కె. అశోక్‌ కుమార్‌ గౌడ్‌, నల్లగొండ పార్లమెంట్‌ అధ్యక్షులు కశిరెడ్డి శేఖర్‌ రెడ్డి, మహబూబ్‌ నగర్‌ పార్లమెంట్‌ అధ్యక్షులు ఎం. శ్రీనివాస్‌ , ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షులు కె. జోగేందర్‌ సింగ్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు మాధవీలత ,చక్రపాణి, కట్ట వెంకటేష్‌ గౌడ్‌, రాష్ట్ర ఎస్టీ సెల్‌ కార్యవర్గ సభ్యుల తదితరులు పాల్గొన్నారు.