వయోవృద్ధులు ఓటు హక్కు వినియోగించుకోవాలి

– జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు
నవతెలంగాణ-పాల్వంచ
ఓటరుగా నమోదైన వయోవృద్ధులు ఓటు హక్కు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్‌ రాంబాబు, స్వీప్‌ నోడల్‌ అధికారి డీఆర్డీఓ మధుసూదన్‌ రాజు తెలిపారు. ఓటు హక్కు వినియోగంపై ఆదివారం ఐడీఓసీ కార్యాలయంలో స్వీప్‌ కార్యక్రమాల్లో భాగంగా ఓటు హక్కు వినియోగంపై వయోవృద్ధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు వినియాగానికి వయోవృద్ధులకు పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. వీల్‌ ఛైర్లు, ర్యాంపులతో పాటు వేచియుండకుండా తక్షణమే ఓటు హక్కు వినియోగించుకునే విధంగా సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. అనంతరం ఓటు హక్కు వినియోగంపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు రచించిన ఓటరు చైతన్య గీతాన్ని వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్వో శ్రీనివాస్‌, మహిళా శిశు సంక్షేమ అధికారి విజేత, దివ్యాన్గుల నోడల్‌ అధికారి త్రినాధ్‌ బాబు, నోడల్‌ అధికారి స్వర్ణలత లేనీనా తదితరులు పాల్గొన్నారు.