వయోవృద్ధుల సంక్షేమం ప్రతి ఒక్కరి బాధ్యత

– జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు
– కలెక్టరేట్లో ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం
నవతెలంగాణ-పాల్వంచ
వయోవృద్ధుల సంక్షేమం సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌ కార్యాలయపు సమావేశపు హాల్లో మహిళ శ్రీ శిశు సంక్షేమ వయవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం కార్యక్ర మానికి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అండగా ఉండాలని చెప్పారు. వయోవృద్ధులు సంక్షేమ కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టాన్ని తెచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్డిఓ మధుసూదన్‌ రాజు, మహిళా శిశు వయోవృద్ధుల విక లాంగుల సంక్షేమ అధికారి విజేత, సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టి.సత్యనా రాయణ, కృష్ణయ్య, బీఎస్‌ఎన్‌ రెడ్డి, జి.భూషన్‌ వెంకటేశ్వరరావు, సందీప్‌, యూసఫ్‌, శేషు, రిటైర్డ్‌ గెజిటెడ్‌ సంఘం అధ్యక్షులు పాపయ్య, శివప్రసాద్‌, ఎర్రగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం రూరల్‌ : కలెక్టరేట్‌లో వయోవృద్ధులు, స్త్రీ శిశు సంక్షేమ, జిల్లా అధికారిని వేల్పుల విజేత, సబ్‌ కలెక్టర్‌, ఇతర జిల్లా అధికారులు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంను పురస్కరించుకొని ఆల్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ భద్రాచలం డివిజన్‌ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావును, వై.మంగయ్య గౌరవ అధ్యక్షులు ఎస్‌.ఎల్‌ తాయారమ్మలను ఘనంగా సాలువలతో బొకేలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి ఎక్కువ సంఖ్యలో పెన్షనర్లు, వయోవృద్ధులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భద్రాచ లం డివిజన్‌ ఆల్‌ పెన్షనర్స్‌ నాయకులు కె.ఎస్‌. ఎల్‌.వి.ప్రసాద్‌, డి.కృష్ణమూర్తి, మాదిరెడ్డి రామ్మోహ నరావు, రాజబాబు, టి.శివప్రసాద్‌, సుబ్బయ్య చౌదరి, అక్కయ్య, తదితరులు హాజరయ్యారు.
దుమ్ముగూడెం : మండల వ్యాప్తంగా జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని 80 ఏండ్లు పై బడి ఓటు హక్కు కలిగిన వయోవృద్ధులను గుర్తించి బూత్‌ లెవెల్‌ అధికారులతో వారిని శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చాలు అందజేసినట్లు తహసీల్దార్‌ పి.చంద్ర శేఖర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్‌ లెవెల్‌ అధికారులు, ఆయా గ్రామ పంచాయతీలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
మణుగూరు : అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ సందర్భంగా రిటర్నింగ్‌ ఆఫీసర్‌ పినపాక, ఎలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో వృద్ధులకు ఘన సన్మానం నిర్వహించారు. ఆదివారం తహసీల్దార్‌ కార్యాలయంలో అవగాహన కార్యక్రమంలో భాగంగా 80 ఏండ్లు దాటిన వృద్ధులకు శాలువాలతో సన్మానించి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నరసింహారావు, తహసీల్దార్‌ నాగిరెడ్డి, ఎంపీఓ పల్నాటి వెంకటేశ్వరరావు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కోడిశాల రాములు, ముత్యం బాబు, పీరినాకి నవీన్‌, కుర్రి నాగేశ్వరరావు, రమేష్‌, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.