నిశ్చింతమైన సాగరంలో అలలు
ప్రజాస్వామ్య క్షేత్రంలో వలలు
ఎన్నికల సమరంలో నాయకులే
జాలర్లుగా తాయిలాలే ఎరలుగా
‘వల’ కు తెలుసు తానొక
ఓటరు పాలిట యమపాశమని
తెలియని గుంపులు ఎరకు
పోటీపడ్డాయి, ఆశపడ్డాయి
నిశ్శబ్ద సాక్షిగా సముద్రం
చోద్యం చూస్తున్నట్టే
మేధావుల వైఖరికి
ప్రజాస్వామ్యం మౌనం
ఎన్నాళ్లిలా?
జీవరాసులు ఆకలి యుద్ధం ప్రకటించగా
అలలన్నీ ఉవ్వెత్తున ఎగిసిపడి
అలజడి సృష్టించింది
సునామీగా మారి జాలర్లను
పాతాళం లోకి తొక్కేసింది
అలల తాకిడికి ఇసుక తిన్నెలు
చల్లగా ఊపిరి పీల్చుకున్నాయి
ప్రజాసేవకు పట్టాభిషేకము !
– న్యాలకంటి నారాయణ, 9550833490