విద్యుత్ బిల్లు రసీదు బుక్క్ పోయినది

నవతెలంగాణ- తాడ్వాయి
మండలంలోని మేడారం పరిధిలో బైక్ పై వెళుతుండగా రషీద్ నెంబర్ 56784 నుండి 56800 గల ఒరిజినల్ మరియు నకల్ రసీదులు, విద్యుత్ బిల్లు, శాశ్వత రసీదు పుస్తకం పోయినది అని ఎన్పీడీసీఎల్ ఏఈ వేణు కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇట్టి విద్యుత్ బిల్లు పుస్తకం ఎవరికి పనిచేయదని, దీనిపై విద్యుత్ శాఖ నుండి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. ఇట్టి విద్యుత్ రసీదు బుక్కు దొరికిన వ్యక్తులు దగ్గరలోని విద్యుత్ శాఖ అధికారులకు గాని, సిబ్బంది గాని అప్ప చెప్పవలసిందిగా కోరారు. ఈ పుస్తకము దొంగిలించిన వారికి చట్టరీత్యా శిక్షార్వులు అవుతారని తెలిపారు. ఎవరికైనా ఆయా పుస్తకం దొరికినచో విద్యుత్ శాఖ ఆఫీసులో అప్పజెప్పగలరని ఏఈ కోరారు.