– ఆందోళనలో రైతులు
నవతెలంగాణ-తల్లాడ
తల్లాడ మండలంలో సాగు జలాలు అందక, చేతికందే పంట ఎండిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల కథనం ప్రకారం మండలంలో సుమారు 26,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎకరా కుసుమారుగా 20 వేల వరకు పెట్టుబడులు పెట్టి పొట్ట దశలో సాగు జలాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామన్నారు, తెల్లగ వరం రైతులు, విద్యుత్‌శాఖ అధికారులకు గొల్లగూడెం రైతులపై ఫిర్యాదు చేశారు. కిష్టాపురం గొల్లగూడెం రైతులు 11 కేవీ పై ఫెన్సింగ్ వైర్లు సైకిల్ చైన్లు వేసి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నారని దీంతో తమ మోటర్లు నిలిచి పొలాలకు నీరందడం లేదన్నారు. తమ ట్రాన్స్‌ఫార్మర్లను ఫీజులు తొలగించి తమకు విద్యుత్ సరఫరా లేకుండా చేసి తమ పొలాలకు మోటార్లకు విద్యుత్ సరఫరా చేయకుండా తమకు ఆ న్యాయం చేస్తున్నారని తెలగవరం రైతులు వాపోయారు. వెంకన్నపేట ఫీడర్ నుండి అంజనా పురం ఫీడర్‌కు తమ లైన్లు మార్చాలని, ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ సిబ్బందిని కాపలా ఉంచాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.