ఉపాధి హామీ రెండో విడత సాధారణ తనిఖీ

– నవతెలంగాణ-కోట్‌పల్లి
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ రెండో విడత సాధారణ తనిఖీ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్‌ ఆవరణలో ఎంపీపీ శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో రెండో విడతలో జరిగిన ఉపాధి హామీ పనులను గ్రామాల్లో సోషల్‌ ఆడిట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించి గ్రామ సభలు నిర్వహించారు. మండల వ్యాప్తంగా మంగళవారం ఉపాధి హామీ అధికారులు ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన మండల సమావేశంలో వివిధ గ్రామాలకు సంబం ధించిన ఉపాధి పనులు ఏ విధంగా జరిగాయని వివ రించారు. కార్యక్రమంలో అడిషనల్‌ డిఆర్‌డిఓ స్టీవెన్‌ ని ల్‌, ఓంబుడ్‌ మ్యాన్‌ రాములు, ఏపీడి, డిఆర్పి, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఏపీఓ ఎలిశా, టెక్నీకల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.