– సంప్రదించాల్సిన నెంబర్లు 9701732697/7893566493
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విదేశాల్లో ప్లేస్‌మెంట్ కోసం ఆయా రంగాల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్) ఆధ్వర్యంలో పరిశ్రమల్లో ఉద్యోగ నియామకాలతో పాటు అప్రెంటీస్‌షిప్‌ను అందిస్తున్నదనీ, ఆసక్తి గలవారు దరఖాస్తు చేయించుకోవాలని టామ్‌కామ్ ఒక ప్రకటనలో కోరింది. జూలై 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐ కళాశాలలోని టామ్‌కామ్ కార్యాలయంలో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ పూర్తయిగానీ, ఐటీఐ పూర్తి చేసిగాని ఉండాలని సూచించింది. అయితే, అభ్యర్థులు 28 ఏండ్ల వయస్సు లోపే ఉండాలని పేర్కొంది. మరిన్ని వివరాల కోసం www.tomcom. telangana.gov.in నిసందర్శించాలనీ, 9701732697/ 7893566493 నెంబర్లను సంప్రదించాలని సూచించింది.