– చింతగట్టు తండాలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పర్యటన
– రెండున్నర లక్షల జడ్పీ నిధులతో అండర్ డ్రయినేజీ ప్రొసిడింగ్ అందజేత
– పాల్గొన్న బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ
నవతెలంగాణ-కొత్తూరు
బీఆర్‌ఎస్ హయంలో గిరిజన తండాలు అభివృద్ధి చెందాయని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి సిద్దాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని చింతగట్టు తండాలో సర్పంచ్ వడ్డే తులసమ్మ బాలయ్య ఆధ్వర్యంలో పర్యటించారు. తండాలో జరుగుతున్న వివిధ అభివద్ధి కార్యక్రమాలను పరిశీలించి జరగాల్సిన అభివద్ధి పనుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన అండర్ డ్రయినేజీ నిర్మాణం నిమిత్తం రెండున్నర లక్షల జడ్పీ నిధుల ప్రొసిడింగ్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు రాంబాల్ నాయక్, మాజీ ఎంపీటీసీ వడ్డే బాలయ్య, బీఆర్‌ఎస్వి మండలాధ్యక్షులు వడ్డే మహేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.