నవతెలంగాణ- శంకరపట్నం
కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శంకరపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తాసిల్దార్ గూడూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం బిఎల్ఓలకు, బిఎల్ఓ సూపర్వైజర్లకు అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్ ఏఎఎల్ఎంటి పోలింగ్ బూత్ స్థాయి అధికారుల ద్వారా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలని నియోజకవర్గ స్థాయి అధికారులతో బూతు స్థాయి అధికారుల ద్వారా బిఎల్వోలకు అవగాహన కల్పించి ప్రతి పౌరుడు ఎన్నికల నియావళినీ తప్పక పాటించాలని తహసిల్దార్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ లక్ష్మారెడ్డి, ఏఎల్ఎంటి వివిధ గ్రామాల బిఎల్వోలు సూపర్వైజర్, తదితరులు పాల్గొన్నారు.