నవతెలంగాణ-కొత్తగూడెం
రక్షణ చర్యలలో ప్రతీ ఉద్యోగిని భాగస్వామ్యులను చేయాలని తద్వారా సింగరేణి సంస్థను ప్రమాదాలు లేని సంస్థగా తీర్చి దిద్ది కోల్ ఇండియా స్థాయిలో సింగరేణి సంస్థకు పేరు తీసుకురావాలని అధికారులు కోరారు. తద్వారా సింగరేణి సంస్థను ప్రమాదాలు లేని సంస్థగా తీర్చి దిద్ది కోల్ ఇండియా స్థాయిలో సింగరేణి సంస్థకు పేరు తీసుకురావాలని కోరారు. శనివారం కొత్తగూడెం ఇల్లందు క్లబ్ నందు భధ్రతా చర్యలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సంధర్భముగా సింగరేణి డైరెక్టర్స్ డైరక్టర్ ఈఅండ్‌ఎం డి.సత్యనారాయణ రావు, డైరక్టర్ ఆపరేషన్స్ ఎన్.వి.కె.శ్రీనివాస్ మాట్లాడారు. సింగరేణి సంస్థను ప్రమాదాలు లేని సంస్థగా తీర్చి దిద్ది కోల్ ఇండియా స్థాయిలో సింగరేణి సంస్థకు పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిఎం సేఫ్టీ కె.గురవయ్య, రీజనల్ సేఫ్టీ జిఎంలు జె.కుమార స్వామి, ఎస్.సాంబయ్య, కె.హెచ్‌ఎన్ గుప్తా, ఎస్‌ఓ టు డైరక్టర్ (పిఅండ్‌పి) జి.నాగేశ్వర రావు పాల్గొన్నారు.