ప్రతి రైతూ యజమాన పద్ధతులను పాటించాలి

– అధిక తేమ నుంచి పంటలను రక్షించుకోవాలి
– వ్యవసాయ శాఖ ఏడి రుద్రమూర్తి
నవతెలంగాణ-తాండూర్‌ రూరల్‌
భారీ వర్షాల వలన పొలాల్లో అధిక తేమ నుంచి పంటలను రక్షించుకునేందుకు, రైతులు యాజమాన్య పద్ధతులు తప్పక పాటించాలని తాండూర్‌ ఏడిఏ రుద్రమూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెలిక దశలో మొక్కల సాంద్రత లేక పోతే రైతులు విత్తనాలను మరల వెతుక్కో వాలన్నారు. వర్షధార పంటలు పత్తి, మొక్కజొన్న, కంది పంటల్లో అధిక నీటిని ఉంచకుండా పొలాల నుంచి వర్షపు నీటిని బయటకు పంపే విధంగా చర్యలు తీసు కోవాలని సూచించారు. పొలాల్లో అనువైన సమ యంలో గుంటుకతో అంతర కృషి చేయాలన్నారు. ఎకరాకు 20 కిలోల యూరియా వాడాలన్నారు. ఈ సాగు చేసిన ప్రతి రైతూ ఒక శాతం పొటాషియం నైట్రేట్‌ ద్రావణం పిచికారి చేయాలన్నారు ఆ తర్వాత అవసరాన్ని ప్రకారం సూక్ష్మ పోషకాలను పిచికారి చేయాలని సూచించారు. మురుగునూరు వెళ్లే సౌక ర్యం లేని నేలల్లో పత్తి పంటను రక్షించుటకు రెండు శాతం యూరియా ద్రావణంతో పాటు ఒక శాతం, మెగ్నీషియం సప్లట్‌ను పిచికారి చేయాలన్నారు తెగులను నివారించుటకు మూడు గ్రాముల కోపర్‌ జిన్‌, ఒక లీటర్‌ నీటిలో కలిపి మొక్కల మొదళ్ల వద్ద నీళ్లు చల్లాలని చెప్పారు. బ్యాక్టీరియా ఆకు మచ్చ తెగుళ్లను నివారించి, పూత దశ నుంచి ఏర్పడే దశలో పొలాల్లో నీటిని వెంటనే తీసేసి ఎకరాకు 20 కిలోల యూరియా , 15 కిలోల ఫొటోస్‌ వాడాలి లేదా 2. 5. గ్రాముల మ్యాంకో జిప్‌ రెండు లేదా మూడుసార్లు పిచికారి చేయాలన్నారు. లద్ది పురుగు నివారణానకు చర్యలు తీసుకో వాలన్నారు. రైతులు యజమాని పద్ధతులను పాటిం చడంతో ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుం దన్నారు. రైతులంతా వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు అందులో ఎరువులను వాడాలని తెలిపారు.