– తెలంగాణలో అరాచక పాలన అంతానికి సమయం ఆసన్నమైంది
– తెలంగాణలో వచ్చేది ఇందిరమ్మ రాజ్యం
– బూత్ కమిటీ సమావేశంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చేందుకు తెలంగాణ ప్రతిబిడ్డ గుండె పరితపిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో అధికరంలో ఉన్న కేసీఆర్ అరాచక పాలన అంతానికి సమయం ఆసన్నమైందని మాజీ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పాలేరు నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం తిరుమలాయపాలెం మండల పరిధిలోని మాదిరిపురం స్టేజిలో జరిగిన బూత్ కమిటీ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రతి బిడ్డ గుండె పరీతప్పిస్తుందని అన్నారు. ప్రతి బూత్ సభ్యులు సమయం తక్కువ ఉండటంతో ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసి రాష్ట్రంలో కొనసాగుతున్న రాచక పాలనకు సాగనంపాలని కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రతి ఒక్కరు కంకణ బద్ధులై 25 రోజులు కష్టపడాలని కోరారు. పాలేరులో కాంగ్రెస్ హస్తం మీద గెలిచి బిఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న కందాళ ఉపేందర్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో తట్టెడు మట్టి కూడా పాలేరులో పోయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు, చావా శ్రీరామకృష్ణ, రామ సహాయం నరేష్‌రెడ్డి, పార్లమెంటు ఇన్చార్జి రెహనా బేగం, రాష్ట్ర నాయకులు స్వర్ణకుమారి, జడ్పిటిసి బెల్లం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, రామ్‌రెడ్డి, చరణ్ రెడ్డి, మండల పరిషత్ వైస్ ఎంపీపీ బుద్ధ వంశీకృష,్ణ గండ్ర గోపాలరావు, న్యాయవాదులు నిరంజన్‌రెడ్డి, అరవింద్ రెడ్డి, వీర కుమార్ ఇస్లావత్ ఎంటెక్ రవి ఇస్లావత్ నరేష్ బా నోత్ రమేష్ ఇస్లావత్ నాగేష్, సిలబద్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.