ప్రతి ఒక్క విద్యార్థి సేవా దృక్పథంతో ముందుకు రావాలి

నవతెలంగాణ – రాజంపేట్
ప్రతి ఒక్క విద్యార్థి సేవా దృక్పథంతో ముందుకు రావాలని సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్ సీఐ  దొడ్లే మోహన్ రావు పేర్కొన్నారు. మండలంలోని ఆరేపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఫైర్ సిబ్బంది ఆధ్వర్యంలో  బుధవారం అగ్నిమాపక దళం డెమో క్లాసుల నిర్వహణ, సీసీ కెమెరాల ఇనాగ్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి ఫైర్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్నిమాపక దళం గురించి విద్యార్థులకు ప్రాక్టికల్స్ క్లాసులు నిర్వహించడం జరిగిందిఅన్నారు.  విద్యార్థులకు అగ్ని మాపక దళం గురించి వివరిస్తూ విద్యార్థులు పాఠశాల దశ నుండి ఉన్నత చదువుల కోసం ఆలోచన చేయాలని మరియు ప్రతి ఒక్కరు సేవాదృతంతో ముందుకు రావాలని ప్రభుత్వ పాఠశాలను మంచి స్థాయికి  తీసుకురావాలని పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులను అభినందిస్తూ పాఠశాల సిబ్బందిని, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అంకం శ్యాంరావును అభినందిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా వారు ఆరేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు సీసీ కెమెరాస్ డొనేట్ చేస్తూ ఈరోజు సీసీ కెమెరాలను వారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అనంతరం సికింద్రాబాద్ ఫైర్ సిఐ దొడ్లే మోహన్ రావు ను  ఎస్ఎంసి చైర్మన్ అంకం శ్యామ్ రావు శాలువాతో సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం గంగమోహన్,సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్ సిఐ దొడ్లే మోహన్ రావు,పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అంకం శ్యామ్ రావు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది  కామారెడ్డి ఫైర్ స్టేషన్ ఎస్హెచ్ఓ వారి సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.