
దిగుమతి నాయకుల ఎత్తులను చిత్తు చేస్తున్న కాంగ్రెస్.
ములుగు నియోజకవర్గ వ్యాప్తంగా దిగుమతి నాయకులు చేస్తున్న కుటిల ప్రయత్నాలను ఎక్కడికక్కడ కాంగ్రెస్ వర్గాలు తిప్పికొడుతున్నాయి. నాయకులు దొంగచాటుగా పంపిణీకి సిద్ధం చేసిన క్రీడా కిట్లను కుట్టు మిషన్లను ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏ గ్రామంలో చీమ చీటుక్కుమన్న కాంగ్రెస్ శ్రేణులు అదే తీరులో స్పందిస్తున్నారు. ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా కాంగ్రెస్ సైనికులు ఇతర పార్టీ నాయకుల ప్రలోభాలను తాఇలాలను కుటిల ప్రయత్నాలను తుత్తునియ్యలు చేస్తూ వీరోచతంగా ముందుకు సాగుతున్నారు.
వలస నాయకులు ఎన్నికల వరకే పరిమితం
ఎన్నికలు లక్ష్యంగా ములుగు నియోజకవర్గానికి వలస వచ్చిన నాయకులు ఎన్నికల వరకే పరిమితం అవుతారని ఆ తర్వాత ఎవరు కంటికి కనబడరని సీతక్క అన్నారు. ఈ గ్రామంలో ఎక్కడ ఆపద వచ్చిన ఉప్పెన వచ్చిన ఉపద్రవం వచ్చిన పిలిచినా పిలువకపోయినా వెంటనే వచ్చి మీ ముందుండేది సీతక్క మాత్రమేనని అన్నారు. కరోనా సమయంలో ఈ వర్షాకాలం వరదల సమయంలో ఈ వలస నాయకులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకొని వారికి ఇప్పుడు ఏ అర్హతతో వస్తున్నారు ప్రజలే అర్థం చేసుకోవాలని సూచించారు.
ఇప్పటికే వలస నాయకుల ఎత్తులు చిత్తవుతున్నాయని ఇకముందు కూడా వలస నాయకుల ఆటలు సాగవని అన్నారు. దిగుమతి నాయకులు ఓట్ల తెల్లారి ఎగుమతి అయిపోతారని మళ్లీ ప్రజల వద్ద సీతక్కే ఉంటుంది. బీఆర్ఎస్ లకు నామకరణానికి పెళ్లికి పేరంటానికి చావుకు తద్దినానికి ఏ నాయకుడు రాడని సీతక్క మాత్రం ఎక్కడ ఏ కార్యం జరిగిన తను హాజరై ఆ కుటుంబ సభ్యులను స్థానిక ప్రజలను పరామర్శించి క్షేమ సమాచారం తెలుసుకొని అవసరాలను రాసుకొని పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తుందని ప్రజలు అంటున్నారు. వలస నాయకులు పారిపోక తప్పదని రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఏటూర్ నాగారంలో గత కొంతకాలం నుంచి తీష్ట వేసిన వ్యక్తి హైదరాబాద్ తన సొంత గుటికి పరిగెత్తుతాడని అన్నారు. సమస్యలన్నింటినీ కాలమే పరిష్కరిస్తుందని ప్రజలు మాత్రం విజయాన్ని అందిస్తారని అన్నారు.