ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలి

– నిర్ధేశించుకున్న లక్ష్యం 700 లక్షల టన్నులు
– త్వరలో కొత్త గనులు
– గణతంత్ర వేడుకల్లో సింగరేణి సీ అండ్‌ ఎండి బలరామ్‌
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సంస్థ నాదే అనే అంకిత భావంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ఉత్పత్తి లక్ష్యాలను సాధించడమే కాదు, బొగ్గు ఉత్పత్తిలో రక్షణ, నాణ్యత పాటించాలని, సంస్థ నిర్ధేశించిన 700 లక్షల టన్ను బొగ్గు సాధించాలని, సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని సింగరేణి చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.బలరామ్‌ అన్నారు. శుక్రవారం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో 75వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత మన కోసం, మనం రాసుకున్న రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చిన పవిత్ర దినం, ప్రపంచ మేధావి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సారథ్యంలో గొప్ప రాజ్యాంగాన్ని లిఖించుకోవడం జరిగిందన్నారు. చైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఈ నెల రోజుల కాలంలో నేను అనేక గనులు విజిట్‌ చేశానని, గని లోపల, బయట కూడా వందలాది మంది కార్మికులతో మాట్లాడానని చెప్పారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను సంధర్భముగా ఉత్తమ సింగరేణియన్‌గా, ఉత్తమ అధికారులుగా, ఉత్తమ కార్మికులుగా ఎంపికైన వారని ఘనంగా సన్మానించారు. అనం తరం పట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యా ర్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అంద రని అలరించాయి. ఈ సింగరేణ అధికారులు కె.బస వయ్య ఎన్‌.వి.కె. శ్రీనివాస్‌, జి.వేంకటేశ్వర రెడ్డి, డి.సత్యనారాయణ రావు, కె.రాజ్‌ కుమార్‌, కార్మిక సంఘాల నాయకులు, కళాకారులు మరియు కళాశా ల మరియు పాఠశాలల విద్యార్ధులు పాల్గొన్నారు.
ఏరియాలో : కొత్తగూడెం ఏరియా జనరల్‌ మేనేజర్‌ కార్యాలయములో జీఎం ఎం.షాలేం రాజు జాతీయ పతాకావిస్కరించారు. అనంతరం కొత్తగూడెం ఏరియా ప్రధాన గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగముగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ గ్రౌండ్స్‌ రుద్రంపూర్‌లో జాతీయ పతాకావిస్కరణ చేశారు. గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక కాబడిన 6 మంది ఉద్యోగులను వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమ ములో జి.మధురవాణి షాలేం రాజు, జివి.కోటి రెడ్డి, వి.దుర్గా ప్రసాద్‌, బి.రవీందర్‌, బి.శివ కేశవ రావు, ఎం.వేంకటేశ్వర రావు, తదితరులుó పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో : ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్‌ రాజ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా ప్రజలకు, పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి ఎస్పీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి టి.సాయి మనోహర్‌, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ విజరు బాబు డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామీ, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్‌, పాల్వంచ డిఎస్పీ వెంకటేష్‌, సైబర్‌ క్రైమ్స్‌ డిఎస్పీ కృష్ణయ్య, ఇల్లందు డీఎస్పీ రమణ మూర్తి, జిల్లా పోలీస్‌ కార్యాలయ ఏవో జయరాజు, పోలీస్‌ అధికా రుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
జెడ్పీ కార్యాలయంలో : జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ మెరుగు విద్యాలత జాతీయ జెండా పతాకాన్ని అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌ పర్సన్‌ కంచర్ల చంద్రశేఖర రావు, జిల్లా పంచాయతీ రాజ్‌ ఈఈ ఎస్‌.శ్రీనివాసరావు, ఉప ముఖ్య కార్యనిర్వాహణాధికారి బి.నాగలక్ష్మి, ఎంపిపి బాదావత్‌ శాంతి, ప్రజా ప్రతినిధులు, కార్యాల సిబ్బంది పాల్గొన్నారు.