ముందు అందరూ షాక్‌ అయ్యారు

ముందు అందరూ షాక్‌ అయ్యారుమన దేశంలో లైంగిక విషయాలు, శుభ్రత, ఆరోగ్యం గురించి మాట్లాడటమంటే అదొక పెద్ద తప్పుగా భావిస్తారు. అందునా మహిళలు మాట్లాడితే ఏదో ఘోరం చేసినట్టు అనుకుంటారు. అటువంటి సమాజంలో ఓ మహిళ లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులను తయారు చేస్తుందంటే మరింత ఆశ్చర్యంగా చూడటం సహజం. కానీ ఆమె మాత్రం అలా అనుకోలేదు. మహిళల ఆరోగ్యం గురించి అలోచించి, లైంగిక జీవితంలో తాను స్వయంగా ఎదుర్కొన్న సమస్యలు మరే మహిళా ఎదుర్కోకూడదనుకున్నారు కోమల్‌ బల్ద్వా. ఆ సమస్యలకు పరిష్కారంగా కండోమ్స్‌ తయారు చేయాలనుకున్నారు. అయితే ఈ బిజినెస్‌ ప్రారంభించాలనే ఆలోచన వచ్చినపుడు ఆమె ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో, వాటి నుండి ఎలా బయట పడ్డారా, వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళారో తెలుసుకుందాం…
కోమల్‌కు బిజినెస్‌ ఆలోచన వచ్చిన వెంటనే ముందుగా తన భర్త నమిత్‌తో పంచుకున్నారు. ముందు ఆయన కాస్త ఆలోచించారు. కుటుంబ సభ్యులు కూడా షాక్‌ అయ్యారు. అందరినీ ఒప్పిం చటం ఆమెకు ఓ సవాలుగా నిలిచింది. అయినా ఎలాగా ఇంట్లో వారందినీ ఒప్పించగలిగారు. భార్య ఆలోచనకు మొదట షాక్‌ అయినప్పటికి నమిత్‌ ప్రోత్సహించాడు. ఆయన ప్రోత్సా హంతో బ్లూ పేరుతో కంపెనీని ప్రారంభిం చారు కోమల. ఇప్పుడు నమిత్‌ ఆ కంపెనీకి ఫౌండర్‌గా వున్నారు.
అవగాహన కల్పిస్తూ…
మహిళలు పలకడానికి ఇష్టపడని పదాన్ని తన వ్యాపారంగా మలచుకున్నారు కోమల్‌. వ్యాపారం ప్రారంభించడమే కాదు ఓ పారిశ్రా మికవేత్తల ఎదిగి మంచి గుర్తింపు తెచ్చు కున్నారు. ఎదురైన సవాళ్ళని ధైర్యంగా ఎదు ర్కొంటూ ముందడుగు వేసి ఎందరో మహిళలకు ఆదర్శవంతురాలిగా నిలిచారు. మహిళా లోకానికి మనం ఏదైనా సాధించగలం అని నిరూపించారు. లైంగిక విషయాల గురించి మాట్లాడుకోవడం తప్ప కాదని, గర్భ నిరోధక మాత్రలకంటే కండోమ్స్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిదనే అవగాహన కల్పిస్తున్నారు.
షాకింగ్‌ స్టెప్‌ తీసుకుని
బ్లూ కంపెనీ స్థాపించక ముందు కోమల్‌ కన్స్ట్రక్షన్‌ బిజినెస్‌ చేశారు. ఆమె ఐఐఎమ్‌లో ఎగ్జిక్యూటివ్‌ మేనేజ్‌మెంట్‌ చదివారు. తర్వాత యుకే గ్రౌండ్‌ ఫీల్డ్‌లో మార్కెటింగ్‌ పూర్తి చేశారు. పురుషాధిక్య సమాజంలో కంపెనీ ప్రారంభించిన కొత్తలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ తాను ఎంచుకున్న బిజినెస్‌లో నాణ్యత వుండాలని బలంగా కోరుకున్నారు. ఆరోగ్యమే లక్ష్యంగా వ్యాపారంలో ఎన్నో నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు. 2019లో ‘బ్లూ కండోమ్‌’ పేరిట స్టార్ట్‌ అప్‌ కంపెనీని స్థాపించి షాకింగ్‌ స్టెప్‌ తీసుకుని ఎన్నో ఇబ్బందులను అధిగమించి విజయం సాధించారు. ఇండియాలో మొదటి ‘స్పిరల్‌ కండోమ్‌’ను తయారు చేస్తున్న సంస్థ తమది అని ఆమె గర్వంగా చెబుతున్నారు. అంతే కాదు దేశం మొత్తంలో మొదటి ‘వేగన్‌ కండోమ్‌’ బ్రాండ్‌గా కూడా ఆమె కంపెనీ గుర్తింపు పొందింది. ప్రస్తుతం తన కంపెనీలో నాలుగు రకాల కండోమ్స్‌ అందుబాటులో ఉన్నాయని ఆమె చెబుతున్నారు.
ఉపాధి కల్పిస్తూ…
వి హబ్‌ తోడ్పాటుతో ఆమె మార్కెటింగ్‌లో మంచి ఫలితాలను సాధిస్తున్నారు. తాను వ్యాపారం ప్రారంభించి ఓ పారిశ్రామిక వేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ ప్రొడక్ట్స్‌ అంతర్జాతీయ స్టాండడ్స్‌తో, గ్రీన్‌ అండ్‌ బయోడిగ్రెడబుల్‌ ప్యాకేజింగ్‌తో ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయి స్తున్నారు. అమ్మ కాలు ఆన్‌లైన్‌లో అయినప్పటికి వ్యాపారం మంచి స్థాయిలో ఉందని ఆమె ఆనందంగా చెబుతున్నారు.
ఉపాధి కల్పిస్తూ…
వి హబ్‌ తోడ్పాటుతో ఆమె మార్కెటింగ్‌లో మంచి ఫలితాలను సాధిస్తున్నారు. తాను వ్యాపారం ప్రారంభించి ఓ పారిశ్రామిక వేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ ప్రొడక్ట్స్‌ అంతర్జాతీయ స్టాండడ్స్‌తో, గ్రీన్‌ అండ్‌ బయోడిగ్రెడబుల్‌ ప్యాకేజింగ్‌తో ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయిస్తున్నారు. అమ్మకాలు ఆన్‌లైన్‌లో అయినప్పటికి వ్యాపారం మంచి స్థాయిలో ఉందని ఆమె ఆనందంగా చెబుతున్నారు.
ప్లాస్టిక్‌ కవర్లు వాడము
‘సాధారణంగా కండోమ్స్‌ ప్యాకెట్‌పై ఇంగ్రీడియన్స్‌ రాయరు. మేము మాత్రం తన ప్రొడక్ట్‌ ప్యాకెట్‌ పైన ఇంగ్రీడి యంట్స్‌ వివరాలు అందిస్తాము. మా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్‌ కవర్లు అస్సలు వాడము. బాయోడిగ్రెడబుల్‌ మెటీరియల్‌తో మేము ఈ ఉత్పత్తులను తయారు చేయిస్తున్నాం. ఎటువంటి రసాయనాలను వాడకుండా కండోమ్‌లను తయారు చేయ డంతో పాటు కర్భన వినియోగాన్ని కూడా ఉత్పత్తులో తగ్గించాము. ప్రపంచం లో స్ప్రెరల్‌ కండోమ్‌లను అందిస్తోంది కూడా మా ‘బ్లూ’ కంపెనీ మాత్రమే’ అంటున్నారు కోమల్‌.
– పి. విశాలాక్షి