ప‌నెక్కువ వేత‌నం త‌క్కువ‌..

Manaviఅనారోగ్యంతో ఆస్పత్రికి వెళితే ముందు మనల్ని పలకరించేది అక్కడి నర్సులు. మనకేం కావాలన్నీ దగ్గర రుండి చూసుకునేది వారే. అంతెందుకు కరోనా సమయంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్యసేవలు అందించిన వారిలో నర్సుల పాత్రే కీలకం. అలాంటి నర్సుల శ్రమకు మన దేశంలో విలువ లేకుండా పోతుంది. వారికి కనీస వేతనాలేవు. శ్రమదోపిడికి గురవుతున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం…
నలభై ఐదేండ్ల పరిణీతి… లక్నోలోని యూనివర్సిటీ నుంచి నాలుగేండ్ల కిందట నర్సింగ్‌లో డిప్లొమా చేసింది. వ్యాధిగ్రస్తులకు సేవ చేయాలని ఎప్పటి నుంచో కోరిక. కానీ గత ఏడాది లక్నోలోని ఒక ప్రయివేట్‌ ఆసుపత్రిలో పని చేస్తూ తన ఉద్యోగాన్ని వదిలివేయవలసి వచ్చింది. చేయని తప్పుకు ఒక వైద్యుడు ఆమెను రోగులు, వార్డు అటెండెంట్ల ముందు చెప్పుతో కొట్టాడు. ఇప్పుడు లక్నోలోని మిశ్రా మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో పని చేస్తున్న పరిణీతి చెప్పింది. ‘నేను నా రాజీనామా ఇచ్చేందుకు వెళితే అప్పటికే నన్ను ఉద్యోగం నుండి తొలగించినట్టు డాక్టర్‌ చెప్పారు. ఐదుగురు ఉన్న మా కుటుంబంలో సంపాదించేది నేనొక్కదాన్నే. నా జీతం పది వేలు. ప్రతి నెలా 18వ తేదీ వరకు జీతం రాదు’ అని ఆమె చెప్పింది.
డిమాండ్‌ పెరిగినప్పటికీ
డబ్ల్యూహెచ్‌ఓ 2018 నివేదిక ప్రకారం భారతదేశంలో 20.5 శాతం పురుష నర్సులు, 80 శాతం మహిళా నర్సులు ఉన్నారు. దేశంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు 1.96 మంది నర్సులు ఉన్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మరో గణాంకాలు చెబుతున్నాయి. ఆరోగ్య సంరక్షణ కార్మికులకు డిమాండ్‌ పెరిగినప్పటికీ, ముఖ్యంగా కోవిడ్‌ మహమ్మారి తర్వాత. అయినా మహిళా నర్సులు వేతన వ్యత్యాసం, లైంగిక వేధింపులు, పెరిగిన పనిభారం, అపరిమిత పని గంటలు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొం టూనే ఉన్నారు. లైంగిక వేధింపుల కారణంగా 41 ఏండ్ల కోమాలో ఉన్న నర్సు అరుణా షాన్‌బాగ్‌ విషాద కథ వ్యవస్థలోని నర్సుల దుర్బల స్థితికి ప్రతిబింబం. 2022 లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అంతర్గత కమిటీల ఏర్పాటు, వార్షిక ఆరోగ్య పరీక్షలు, క్రెచ్‌ సదుపాయం, వారానికి 40 గంటలకు మించని పని గంటలు, ఇతర చర్యలతో పాటు పని పరిస్థితులను మెరుగు పరిచేందుకు ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ ఈ మార్పులు నర్సింగ్‌ హౌమ్‌లు, ఆసుపత్రులలో అమలుకు నోచుకోలేదు.
వత్తిపరమైన విభజన
‘కోల్‌కతా ఇన్‌ స్పేస్‌, టైమ్‌ అండ్‌ ఇమాజినేషన్‌ వాల్యూం 2’ అనే పుస్తకంలో నగరచరిత్రలో అట్టడుగున ఉన్న శ్రామిక రంగాల (స్త్రీలుగా ఉన్నవాటితో సహా) గురించి క్రియా విశ్వవిద్యాలయంలో ఆంత్రోపాలజీ అండ్‌ జెండర్‌ స్టడీస్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పాంచాలి రే ఎత్తి చూపారు. వైద్యరంగంలో మహిళల విషయానికి వస్తే శిక్షణ పొందిన లేడీ డాక్టర్‌, వంశపారంపర్యం గురించి ఎక్కువగా దష్టి పెడుతుంది. శిక్షణ పొందిన నర్సులను నియమించుకుంటే ఖర్చు ఎక్కువ. అందుకే శిక్షణ పొందని నర్సునో లేదో రీట్రైన్డ్‌ వారిని నియమించుకుంటున్నారు. అందువల్ల బెంగాల్‌లో చట్టం (1920) ప్రకారం శిక్షణ లేని నర్సును తొలగించడం మొదలుపెట్టారు. ‘అయినప్పటికీ, ఇది నైపుణ్యాలు, నమోదు, శిక్షణ ఆధారంగా కొత్త సమస్యలను సష్టించింది. నర్సింగ్‌ సేవల నుండి పాక్షికంగా-శిక్షణ పొందిన/శిక్షణ లేని మహిళను తొలగించలేకపోయింది’ అని రే జతచేస్తుంది.
కాంట్రాక్ట్‌ కార్మికులుగా
ఈ కాలంలో నర్సింగ్‌ కోర్సుల్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి. మూడేండ్ల జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ (+చీవీ) శిక్షణ లేదా నాలుగేండ్ల దీూష నర్సింగ్‌ కోర్సును పూర్తి చేసిన నర్సులు ఉన్నారు. వీరంతా ఖఖ లేదా ఆల్‌ ఇండియాలో నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ (చీనూ) వంటి అగ్రశ్రేణి సంస్థల్లో రిజిస్టర్డ్‌ నర్సింగ్‌ ఉద్యోగాలను పొందవచ్చు. భారతదేశంలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (A××వీూ)లో అధికారిక విద్యను పొందలేని వారు పాక్షిక శిక్షణ లేదా ఏడాది డిప్లొమా పొందుతున్నారు. చిన్న నర్సింగ్‌ సెంటర్లు, ప్రైవేట్‌ ఆసుపత్రులలో కాంట్రాక్ట్‌ కార్మికులుగా నియమించబడుతున్నారు. ఇవి తరచుగా నిబంధనలను ఉల్లంఘించే, శ్రమదోపిడీకి గురయ్యే, వేతనాలు ఇవ్వని పరిస్థితులకు దారితీస్తున్నాయి.
ఫిర్యాదు చేసే ధైర్యం లేదు
50 పడకల కంటే తక్కువ ఉన్న ఆసుపత్రుల్లో పనిచేసే నర్సుల కనీస వేతనం రూ.20,000గా ఉండాలని 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దేశవ్యాప్తంగా వేలాది ప్రైవేట్‌ ఆసుపత్రులు, నర్సింగ్‌హౌమ్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండటంతో ఉల్లంఘనలు నిరాటంకంగా జరుగుతున్నాయని AIRNF యూపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. ‘వాటిలో చాలా వరకు స్థానిక ఎమ్మెల్యేలు, రాజకీయంగా ప్రభావవంతమైన కుటుంబాలచే నిర్వహించబడుతున్నాయి. తక్కువ వేతనం, లైంగిక వేధింపులు, ఓవర్‌టైమ్‌వర్క్‌ వంటి సవాళ్లు ఎదుర్కొంటున్నట్టు నర్సులు చెబుతున్నారు. మేము ఈ ఫిర్యాదులను రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు తీసుకువెళ్లినప్పటికీ నర్సులు స్వయంగా రాతపూర్వక ఫిర్యాదు ఇస్తే తప్ప వారు చర్య తీసుకోరు. అలా చేయడానికి వారికి ధైర్యం లేదు’ అని ఆయన చెప్పారు.

విదేశాల్లో ఉద్యోగం చేసి
జార్ఖండ్‌, బీహార్‌, మణిపూర్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలతో తన పరిశోధనలో భాగంగా, చిన్న గ్రామాలకు చెందిన చాలా మంది గిరిజన బాలికల తల్లిదండ్రులు నర్సింగ్‌ కోర్సుల కోసం తమ భూమిని తనఖాలో పెట్టారనిరే కనుగొన్నారు. ‘దీనికి ప్రధానంగా కారణం వారు విదేశాలకు వెళ్లి పని చేసి రుణాలు తిరిగి చెల్లించాలి’ అని రే చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నర్సుల కొరత ఉందని, అటువంటి లోటును ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పరిగణించాలని ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నర్సుల మార్చి 2023 నివేదిక పేర్కొంది. ‘మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం చారిత్రాత్మకంగా తక్కువగా ఉంది. వెనకబడిన మహిళలు చేయగలిగిన పని గృహపని, సెక్స్‌వర్క్‌, నర్సింగ్‌ మాత్రమే. ఇవన్నీ సాంప్రదాయకంగా స్త్రీ కార్మికులుగా పరిగణించబడతాయి. వలస వచ్చిన నర్సులు భారతదేశంలో చేసే దానికంటే విదేశాలలో మెరుగైన జీతాలు పొందుతున్నప్పటికీ, వారు చాలా జాత్యహంకారానికి గురవుతారని రే చెప్పారు.
యూనియనీకరణ
కోవిడ్‌ -19 మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా సంరక్షణ కార్మికులు నిరంతరం షిఫ్టులలో పనిచేస్తున్నారు. పరీక్షలు చేయించుకోకుండా, అనారోగ్యానికి గురవుతున్నారు. వారి సెలవులు రద్దు చేయబడ్డాయి, చాలా మంది వేతనాన్ని కూడా కోల్పోయారు. అయితే ప్రయివేట్‌ నర్సింగ్‌లోని మహిళలు వేతనాలు, లీవ్‌లు, ప్రసూతి ప్రయోజనాలు, పని గంటల వంటి విషయాల్లో ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వీటన్నిటినీ యూనియన్‌ల ద్వారా మాత్రమే పరిష్కరించుకోగలరని రే చెప్పారు.
ఎదుర్కొంటున్న సవాళ్లు
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2023-24 కేంద్ర బడ్జెట్‌లో రూ. 89,155 కోట్ల కేటాయింపులను పొందింది. ఇది 2022-23కి సవరించిన బడ్జెట్‌ అంచనాలకు కేవలం 12.6శాతం పెరుగుదల. హెల్త్‌కేర్‌లో తక్కువ బడ్జెట్‌లు ఇప్పటికే నర్సుల వేతనాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ప్రయివేట్‌ ఆసుపత్రులు, నర్సింగ్‌హౌమ్‌లలో పనిచేసే నర్సులకు ప్రభుత్వ నర్సులతో సమానంగా వేతనాలు, పని పరిస్థితులు ఉండాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాన్ని పట్టించు కోవడం లేదు. అంతర్జాతీయ లేబర్‌ ఆర్గనైజేషన్‌ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య శ్రామిక శక్తిలో మహిళలు పురుషుల కంటే 24శాతం తక్కువ వేతనం పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌లలో ఆల్‌ ఇండియా రిజిస్టర్డ్‌ నర్సుల ఫెడరేషన్‌ (AIRNF) పోరాడుతున్న డిమాండ్లలో ఇది ఒకటి.

Spread the love
Latest updates news (2024-04-29 01:03):

authentic cbd most effective gummies | benefits of cbd gummies tu7 25mg | fun drops cbd gummies ingredients Mm7 | we vape 2K0 cbd gummies | cbd gummies for anxiety and panic attacks 4dJ | doctor recommended thc gummies cbd | what should cbd gummies be DJs stamped with | cbd Ofv gummies by mayim bialik | halal free trial cbd gummies | VSl liberty cbd gummies tiger woods | best cbd gummies nyc mGa | would hemp bombs cbd gummies tCm | cbd gummies cbd vape dropshipping | cbd gummies 6fA 40 mg | headache after cbd gummies mOX | kQN cbd gummies arthritis dragons den | just cbd 2MB gummies melatonin | canna organics cbd gummies joe rogan gH7 | cbd gummy bears for headaches J94 | can XuT i get cbd gummies from walmart | feel elite cbd JrL gummies amazon | where to buy cloud 61L 9 cbd gummies | yum fDw yum gummies cbd review | cbd GbQ plus cannabis infused gummies | online sale cbd gummiees | vegan cbd gummys cbd oil | harvest cbd RoW gummies organic hemp extract | free trial cbd gummies dizziness | is cbd gummies bad for UFq renal failure patients | what stores sell Fi8 cbd gummies | wevape 6Qc cbd gummies reviews | oQz is cbd gummies safe to take | gummy cbd extract low price | online sale cbd gummies bolt | 2000 mg cbd SlQ gummies | taking 500mg Ehd of cbd gummies | cbd gummies Q3f help for | 50 mg cbd 1df gummies for anxiety | lQa full send cbd gummies | Fjp mule cbd gummies review | cbd o4k gummies for pain | how nzn does cbd gummies help intestinal problems | anti eKC anxiety cbd gummies | cbd gummies official nc | cbd gummies official alaska | can i XMO take a cbd gummy before work | daytrip cbd gummies Jr1 review | FOL gummy bears with cbd | HwD exhale cbd gummies for pain | rocks vitamins fdX cbd gummies