ఆగస్టు 8న స్టాఫ్‌ నర్సు పోస్టులకు పరీక్ష

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి ఆగస్టు 8న కంప్యూటర్‌ బేస్‌డ్‌ పరీక్షను నిర్వహించనున్నట్టు మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ ఎస్‌ఆర్‌బీ) తెలిపింది. ఈ మేరకు సోమ వారం బోర్డు సభ్య కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు. 5,204 స్టాఫ్‌ నర్సు పోస్టులను భర్తీ చేసేందుకు గతేడాది డిసెంబర్‌ 30న నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.