బాధిత కుటుంబానికి రైతు భీమా ప్రోసెడింగ్ కాపి అందజేత..

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని అమ్సన్ పల్లి గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందిన రాజోళ్ళ నారాయణ కుటుంబ సభ్యులకు మంగళవారం రైతు బీమా కు సంబంధించిన 5 లక్షల ప్రొసీడింగ్ కాపీని ఏఈఓ సతీష్ ఆధ్వర్యంలో బిఅర్ఎస్ సినియర్ నాయకులు తటిపాముల శ్రీనివాస్ గుప్తా, ఉప సర్పంచ్ రాజశ్వర్ లతో కలిసిఅందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు ఇంటికి పేద్ద దిక్కని ప్రమాద వశాత్తూ మృతి చెందడంతో ఆ కుటుంబం పేద్ద దిక్కును కోల్పోయిందని,ఆ కుటుంబానికి అందుకోవడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు భీమా ప్రవేశపెట్టడంతో ఆ కుటుంబానికి కోండత అసర గా నిలిచారని, గ్రామ బిఅర్ఎస్ నాయకులు, బాధిత కుటుంబ సభ్యుల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కవిత కు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సంతోష్, బోన్ల గంగాధర్, భాస్కర్, అష్రాఫ్, రాజేందర్ రెడ్డి,మధుసూదన్, సిరికొండ నరేష్ ,ధర్మాల శ్రీనివాస్, రాజుల చిన్నారెడ్డి, బైరన్ బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.