– ఊరురా పండుగ వాతావరణం
– ఎండ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు
– ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు రైతులతో సహపంక్తి భోజనాలు
– వేడుకలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రైతును రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, రైతు సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రం తీసుకొని సంస్కరణలను సీఎం కేసీఆర్ తీసుకొచ్చా రని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రైతు దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లాల్లో అన్ని రైతు వేదికల్లో కోలహాలంగా నిర్వహించారు. రైతులు ఎడ్లబండ్ల ర్యాలీలు, ట్రాక్టర్లలతో ఊరేగింపుగా రైతు వేదికలకు చేరుకున్నారు. రైతు వేదిక క్లస్టర్ సంబంధించిన రైతులంతా ఒకేచోట కులమతాలకతీతంగా సహఫంక్తి భోజనాలు చేశారు. రైతు దినోత్సవం పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా సబితాఇంద్రారెడ్డి హాజర య్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షే మం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతుబంధు, రైతుబీమా, పంట రుణాల మాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత విద్యుత్, పంట పొలాలకు సమృద్ధిగా సాగునీరు అందించడంతోపాటు వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో దండుగా అన్న వ్యవసాయాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో పండుగలా చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లాలో 3,04, 617 మంది రైతుల ఖాతాల్లో రూ.344 కోట్ల రైతుబంధు డబ్బులు జమ చేశామన్నారు. రైతు బీమా పథకంతో రైతు కుటుంబాలకు ఎంతో అండగా ప్రభుత్వం నిలుస్తుందన్నా రు. 2002-23 ఆర్థిక సంవత్సరంలో 644 మంది రైతు మరణాలు నమోదు కాగా 532 మంది కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ. 26 కోట్ల 60 లక్షలు సాయం అందించిందన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 4413 మంది రైతులకు రూ.2020 కోట్ల పైగా బీమా మొత్తం అందించామన్నారు. ఈ పథకానికి ఐక్యరాజ్యసమితి గుర్తిం పు లభించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని సంతో షం వ్యక్తం చేశారు. వ్యవసాయ సంబంధమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఇతర అంశాలపై రైతులు పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా రైతు వేదికలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో రూ. 18 కోట్ల 26 లక్షల వ్యయంతో 83 రైతు వేదికలను నిర్మించినట్టు తెలిపారు. పాలమూరు -రంగారెడ్డి జిల్లాలను సంపూర్ణంగా సస్యశ్యామలం చేసే విధంగా ప్రభుత్వం పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును నిర్మిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం దాదాపు 60శాతం పూర్తయిందని తెలిపారు. త్వరలోనే పర్యావరణం అనుమతులు సాధించి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో మిషన్ కాకతీయ కింద 999 చెరువులకు పరిపాలన అనుమతులు ఇవ్వగా 956లో పునరుద్ధరణ పనులు చేపట్టినట్టు వివరించారు. ఇందుకు రూ. 132 కోట్ల 95 లక్షల వ్యయంతో పూర్తి చేశామన్నారు. గతేడాది 50 చరువుల మరమ్మతులకు రూ.కోటీ25 లక్షలు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరీ ష్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డి, ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.