– రైతు సంక్షేమానికి సర్కార్ కృషి
– రైతు సంక్షేమ పథకాలపై ప్రచారం
నవతెలంగాణ-గండిపేట్
రైతు సంక్షేమానికి కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని గండిపేట్ మండల్ నార్సింగి క్లస్టర్ విస్తీర్ణ అధికారి డి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం గండిపేట్ మండల్ నార్సింగ్ క్లస్టర్ ఖానాపూర్ రైతు వేదిక భవన్లో దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతులతో పాటు నార్సింగి, బండ్లగూడ, మణికొండ మున్సిపాలిటీల ప్రజా ప్రతినిధులు అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు వట్టినాగులపల్లి ఖానాపూర్ గ్రామాల నుండి రైతులు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ఊరేగింపు ర్యాలీగా రైతు వేదిక భవన్‌కు తరలివచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల కాలం నుండి కేసీఆర్ సర్కార్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు. రైతు బీమా, రైతు బంధు రైతు రుణమాఫీ వంటి పథకాలతో గండిపేట్ మండల్ లో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. ప్రజాసంక్షేమంలో రైతులకు కేసీఆర్ సర్కార్ ఎంతో మేలు చేస్తుందన్నారు. వ్యవసాయ శాఖ తరపున రైతులకు పంట దిగుబడి పైన నిత్యం అవగాహన కల్పిస్తూ, వారికి లాభాలు వచ్చే విధంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఉత్తమ రైతులుగా గండిపేట మండలం వారిని గుర్తిస్తూ సర్టిఫికెట్లతో పాటు సన్మానించారు. కార్యక్రమంలో మెహర్ మహేందర్ గౌడ్, డార్సింగ్ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మేకల ప్రవీణ్ యాదవ్, సింగిల్ విండో చైర్మన్ రామ్ దాస్, కమిషనర్లు సత్యబాబు పాల్గొన్న కుమార్, డి ఈ నరసింహారాజు, కౌన్సిలర్లు రామకృష్ణారెడ్డి పత్తి శ్రీకాంత్ రావు, కోఆప్షన్ సభ్యులు మాలాకీరత్నం, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రామేశ్వరం నరసింహ, మాజీ ఎంపీపీ తలారి మల్లేష్, రైతు కోఆర్డినేటర్లు దారా వెంకటేష్, కోల్కట్ట కృష్ణ, అధికారులు, తహసీల్దార్ రాజశేఖర్, వ్యవసాయ శాస్త్రవేత్త వీర సురేష్, డైరెక్టర్లు, వివిధ శాఖల అధికారులు బీఆర్‌ఎస్ నాయకులు, వ్యవసాయ అధికారులు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.