– జంపాల రవీందర్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రతిరోజు ప్రతినిత్యం ధాన్యం లారీల కోసం రైతులు ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొందని సిపిఐ ములుగు జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. సోమవారం మండలంలోని చల్వాయి గ్రామంలో ధాన్యం సేకరణ కేంద్రాలను సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ధాన్యం ఆరబోసుకునేందుకు స్థలం లేక రైతులు జాతీయ రహదారి వెంట ఆరబోసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రతి గ్రామానికి దాన్యం ఆరబోసుకునేందుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలని అన్నారు. వర్షాకాలం ధాన్యంలో ఏలాంటి కోత విధించని మిల్లు యాజమాన్యం ఇప్పుడు ఎందుకు కోతలు విధిస్తున్నారని ప్రశ్నించారు.బస్తా కి రెండు నుండి 6 కిలోల వరకు కోత విధిస్తున్నారని రైతులు గగ్గులు పెడుతున్నారని అన్నారు. ఆరుకాలం కష్టపడుతున్న రైతాంగానికి, చివరికి లారీలు రాక కొనుగోలు కేంధ్రం లోనే ధాన్యం బస్తాలతోనే పడిగాపులు పడవలసిన పరిస్థితి ఉంది అన్నారు,రైతు ప్రభుత్వం మాది అనే పాలకులకు, లారీలు సమకూర్చాలనే ఆలోచన ఎందుకు లేదు అన్నారు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఈ సమస్య కనిపించడం లేదా అని అన్నారు, గతంలోనే తూకాలు వేయక, వేసినా లారీలు సప్లైచేయక ,వర్షాలకు ధాన్యం బస్తాలు తడిసి రైతులు చాలా నష్టపోయారు అన్నారు,మల్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలకు లారీలు సమకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, సిపిఐ నాయకులు,వడి సారయ్య, అట్లూరి శ్రీనివాసరావు,కొండ కుమార్,అలుగం సమ్మయ్య,పుల్లూరి సమ్మక్క,కొమురమ్మ,సంపత్, పెద్దాపురం ఓదెలు, పెద్ది శంకర్, తదితరులు పాల్గొన్నారు.