వస్తుంది వస్తుంది ఉగాది
కొత్త ఉత్సాహం తెస్తుంది
బాధ, కోపం, ఆవేశం
సంతోషం, ఆగ్రహం, ఆనందం
అన్నిటినీ స్వీకరిస్తాము ఉగాది పచ్చడి రూపంలో
ఈ ఉగాదికి మరో ప్రత్యేకత ఉంది
త్వరలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి
ఎంపీ, ఎమ్మెల్యే, కార్పోరేటర్, సర్పంచ్
ఏ ఓట్లయితేనేమీ..
మన దగ్గరికి వస్తారు పెద్దలు
పెడతారు కమ్మటి భక్షాల విందు
చూయిస్తారు అరచేతిలో వైకుంఠం
ఏరులై పారుతుంది డబ్బు
ఆ పదిరోజులు పండగే సామాన్యుడికి
ఓట్లరోజు వత్తాలని ఉంది అన్ని గుర్తులపై
ఇచ్చారు కదా మరి డబ్బులు అందరూ..
కానీ ఒక గుర్తుపై వత్తగానే మోగింది సైరన్
రమ్మన్నారు బయటకు..
ఎవరో వస్తారు అధికారంలోకి
అప్పుడు తెలుస్తుంది మనం తిన్నది బెల్లంలేని భక్షాలనీ..
వదిలేశారు చెప్పిన హామీలకు తిలోదకాలు
ప్రశ్నిస్తే బడ్జెట్ చర్చా సమావేశాలు అంటారు..
ఎలక్షన్ల ముందు వ్యర్ధ ఖర్చులు
అదే డబ్బులతో కల్పించవచ్చు కదా సామాన్యుడికి వసతులు
అలా చేస్తే వస్తుంది నిజమైన ఉగాది
కానీ మతి లేదు ఓటర్లకు
స్పృహ లేదు నాయకులకు..
చివరికి మిగిలేది వేపపూతే..!
– మోటమర్రి అనురాధ
ఫోన్ : 9392671861