ఎయిర్‌ పోర్ట్‌కు తక్కువ మంది రావాలి

– శంషాబాద్‌ జోన్‌ డీసీపీ నారాయణరెడ్డి
– హై అలెర్ట్‌తో పెంచిన అధికారులు
నవతెలంగాణ-శంషాబాద్‌
ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ప్రయాణం సాగించే ప్రయాణికులను స్వాగతం లేదా సెండ్‌ ఆఫ్‌ ఇవ్వడా నికి వచ్చే వారు ముగ్గురు లేదా నలుగురు కంటే ఎక్కువగా ఉండకూడదని శంషాబాద్‌ జోన్‌ డిసిపి కే నారాయణ రెడ్డి అన్నారు. 15 ఆగస్టు స్వాతంత్ర దినో త్సవ వేడుకల్లో భాగంగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత కారణాలతో హై అలర్ట్‌ ప్రకటించారు.ఈ నెల ఆగస్ట్‌ 28 తేదీ వరకు సందర్శకుల పాసులను అధికారులు రద్దు చేశారు. ఎయిర్‌ పోర్ట్‌కు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీలు చేసి లోనికి అనుమతిస్తున్నారు. బుధవా రం శంషాబాద్‌ జోన్‌ డిసిపి రాజీవ్‌ గాంధీ అంతరా తీయ విమానాశ్రయాన్ని అక్కడ భద్రత విషయా లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ శంషాబాద్‌ ఆర్‌జి అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతిరోజు 70 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని తెలిపా రు. ఇందులో స్వదేశీ ఆగమన నిగమనములు 55,000 మంది చేస్తుంటారని అన్నారు. విదేశాల నుంచి 15వేల మంది ప్రయాణికుల రాకపోకలు ఉంటాయని తెలిపారు . అయితే ఒక్కో ప్రయాణికుని వెంట వారి కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద మొత్తంలో ఎయిర్‌ పోర్ట్‌ కు వస్తున్నారని దీంతో ట్రాఫిక్‌ ఇతర సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపా రు. కొన్ని సందర్భాల్లో 30 నుంచి 40 మంది సెండ్‌ ఆఫ్‌ ఇవ్వడానికి లేదా వారిని స్వాగతం పలకడానికి వస్తున్నారని తెలిపారు. ఈ కారణంగా ఎయిర్‌ పోర్ట్‌ లో ప్రయాణికుల రద్దీ ఎక్కువ అవుతుందని తెలిపా రు. అయితే ఒక్కో ప్రయాణికుని వెంట ముగ్గురు లేదా నలుగురు కంటే ఎక్కువ మంది రాకుండా ఉంటే మంచిదన్నారు. ఈ విషయంలో ఎయిర్‌ పోర్ట్‌ అధికారులకు, పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.