మైనార్టీలకు నేడు ఆర్థిక సాయం చెక్కులు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ యువత స్వయం ఉపాది కోసం వంద శాతం సబ్సీడితో అందిస్తున్న ఆర్థిక సాయం పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నేడు ప్రారంభించనున్నట్టు మైనారిటీ సంక్షేమ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ లోని ఎల్‌బీ స్టేడియంలో ఉదయం 11.30కు లబ్దిదారులకు చెక్కుల పంపిణి కార్యక్రమం అధికారికంగా ప్రారంభ మవుతుందని పేర్కొన్నారు , అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా చెక్కుల పంపిణి కార్యక్రమం జరుగనున్నదని తెలిపారు.