నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని మైలారంలో బీజేపీ కార్యకర్త కొండయ్య పల్లి కృష్ణయ్య కుమారుడు జగదీష్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మరణించారు. విషయం తెలుసుకున్న కేఎస్‌ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి, తమ అనుచరుల ద్వారా బాధిత కుటంబానికి తక్షణసాయంగా ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి ఘనపూర్ వెంకటయ్య, మండలాధ్యక్షులు శేరిరాంరెడ్డి, భూత్ అధ్యక్షులు వెంకటయ్య, గోపాల్, రాంచంద్రయ్య, బాలు, రమేష్, భాస్కర్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.