
మండలంలోని బీరెల్లి గ్రామపంచాయతీ పరిధిలోగల ఆశన్నగూడ ఎల్లాపూర్ లో ఇటీవల మృతి చెందిన వట్టం శ్రీను దశదినకర్మకు గురువారం స్థానిక ఎంపీటీసీ ఇర్సవడ్ల భవాని నారాయణ, వార్డు సభ్యులు లతో కలిసి హాజరై వారి కుటుంబాన్ని పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించి, ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపిటిసి ఇర్సవడ్ల భవాని నారాయణ మాట్లాడుతూ మృతుడు వట్టం శ్రీను కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు జాజ విజయ, మాజీ ఎంపీటీసీ మంకిడి నర్సయ్య, ఉపసర్పంచ్ వంగరి అనసూర్య సదానందం, వార్డు సభ్యులు కెక్కెర్ల సాంబరతి, బెజ్జూరి వెంకన్న, ఈసం సమ్మయ్య, నాయకులు నరేష్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.