మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

నవతెలంగాణ-మొయినాబాద్‌
ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటానని చేవెళ్ల నియోజకవర్గ పీసీసీ మెంబర్‌ రాచమల్ల సిద్దేశ్వర్‌ అన్నారు. మంగళవారం మొయినాబాద్‌ మండలం చిల్కూర్‌ గ్రామంలో ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్‌ యువజన నాయకులు కొండిగారి లక్ష్మణ్‌ కుటుంబాన్ని కలిసి పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా నాయకులు మందడి రాఘవ రెడ్డి,కాంగ్రెస్‌ మొయినాబాద్‌ మండల ఉపాధ్యక్షులు గన్నేపాగ నర్సింగ్‌రావు, యువజన కాంగ్రెస్‌ మండల ఉపాధ్యక్షులు మోత్కుపల్లి భాస్కర్‌, బోలించేర్వు మైపాల్‌ రెడ్డి, ఎర్ర విజరు, చిల్కూర్‌ ప్రశాంత్‌, కొండకల్ల చంద్ర శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.