పీ.ఎం జె.జె.బి.వై తో ఆర్ధిక భరోసా

– యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన(పి.ఎం జే.జే.బి.వై) తో ఆర్థిక భరోసా కలుగుతుందని, ఖాతాదారులకు ఎటువంటి మరణం సంభవించిన వారి నామినీ కి రెండు లక్షలు ఆర్ధిక సహాయం అందుతుందని యూనియన్ బ్యాంక్ అశ్వారావుపేట బ్రాంచ్ మేనేజర్ జి.ప్రవీణ్ తెలిపారు.పట్టణానికి చెందిన షేక్ మస్తాన్ బీ అనారోగ్యం కారణంగా ఇటీవల సాధారణమైన మరణం సంభవించింది.ఆమె ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన లో రూ.436 చెల్లించి ఉన్నందున ఆమెకు నామినీ గా ఉన్న తన కుమారుడు షేక్ అబ్దుల్ రహమాన్ కు యూనియన్ బ్యాంక్ అశ్వారావుపేట బ్రాంచ్,స్టార్ యూనియన్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు సంయుక్తంగా బుధవారం రూ.2 లక్షలు చెక్కు అందించారు. ఈ సందర్భంగా మేనేజర్ ప్రవీణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో చేరాలని భావించే వారు నేరుగా బ్యాంక్ బ్రాంచ్ సిబ్బందిని సంప్రదించి ఈ స్కీం లో చేరొచ్చన్నారు.మే 25 నుంచి మే 31లోపు మీ  ఖాతాలో డబ్బులు ఉంటే కట్ అవుతుందన్నారు.అంటే మీ అకౌంట్ నుంచి ప్రతీ ఏడాది మే నెలలో రూ.436 స్కీం కు జమ అవుతాయని తెలిపారు. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ టర్మ్ ఏడాది ఉంటుందని, అందువల్ల మీరు ప్రతి ఏడాది రూ.436 కడితే పాలసీ రెన్యువల్ అవుతూ వస్తుందన్నారు.ఇలా డబ్బులు కట్టి పాలసీ తీసుకున్న వారు ఏ కారణం చేతనైనా మరణిస్తే.. అప్పుడు ఆ కుటుంబ సభ్యులకు లేదంటే నామినీ కి రూ.2 లక్షల అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలకుంట బ్రాంచ్ మేనేజర్ మురళీకృష్ణ ఇన్సూరెన్స్ ఏజెంట్ సి.హెచ్ సతీష్, యూనియన్ బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.