నవతెలంగాణ-అడిక్‌మెట్
హైదరాబాద్‌లో ప్రతి ఏడాదీ ఆస్తమా వ్యాధిగ్రస్తులకు చేపప్రసాదం పంపిణీ చేస్తున్న బత్తిని హరినాథ్ గౌడ్(84) మృతిచెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు న్న ఆయన భోలక్‌పూర్ పద్మశాలీ కాల నీలోని తన నివాసంలో గురు వారం ఉదయం తుది శ్వాస విడిచారు. హరినాథ్‌గౌడ్‌కు భార్య, ఇద్దరు కొడు కులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలను శుక్రవారం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. చేపప్ర సాదం అంటే బత్తిని హరినాథ్‌గౌడ్ పేరు వినిపిస్తుంది. ఏండ్ల నుంచి మృగశిర కార్తె రోజున ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు బత్తిని హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు చేపమందు పంపిణీ చేస్తున్నారు. హరినాథ్‌గౌడ్ పూర్వీకులు కూడా ఈ చేప మందును ఉచితంగా అందించేవారు. దాదాపు 176 ఏండ్ల నుంచి ఈ చేప ప్రసాదం పంపిణీ సాగుతున్నది. ఇటీవల మృగశిరకార్తె రోజు జరిగిన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో బత్తిని హరినాథ్ గౌడ్ పాల్గొన్నారు.