– శంకుస్థాపన చేసిన మెచ్చా
– కస్తూర్బా వైపు ఓ సారి చూడండి : ఎంపీటీసీ
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మండల కేంద్రంలో గల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాలకు ఐటీడీఏ ద్వారా ప్రహరీ, స్కూల్ బ్లాక్, వాటర్ ట్యాంక్, డ్రైనేజ్ నిర్మాణం కోసం రూ.5 కోట్లు మంజూరు కావడంతో ఆ పనులుకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు సోమవారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఓ కార్యక్రమానికి పాఠశాలకు వచ్చినప్పుడు పాఠశాల చుట్టూ ప్రహరీ లేకపో వడంతో ఆడపిల్లకు రక్షణ సమస్యగా ఉందని పాఠశాల సిబ్బంది చెప్పడంతో సమస్యను గుర్తుంచుకొని ఐటీడీఏ ద్వారా 5 కోట్లు మంజూరు చేయించి శంఖుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా పాఠశాల అవరణం మొత్తం చుట్టూ తిరిగి పరిశీలించారు. పాఠశాల పక్కనే వున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళుకు రహదారి సారిగా లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు ఇవ్వటమే కాదు మార్గం కూడా మంచిగా చూడాల్సిన బాధ్యత ఉందని అధికారులను హెచ్చరించారు. ఈ సారి వచ్చే నిధుల్లో గ్రావెల్ తోలించి సిమెంట్ రోడ్డు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఆశావర్కర్ల, మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె శిబిరం దగ్గరకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకొని సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతాను అని హామీ ఇచ్చారు.
కస్తూర్బా పాఠశాలకు ప్రహ్రారి మంజూరు చేయండి : ఎంపీటీసీ కృష్ణారెడ్డి
ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలకు రూ.5 కోట్లు మంజూరు చేసిన మెచ్చాకి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్‌కు కూతవేటు దూరంలో వున్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు కూడా ప్రహరీ లేదని, బాలిక వున్న పాఠశాలలో ప్రహరీ లేకపోవడం వలన అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. వెంటనే ప్రహరీ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసే విధంగా చూడాలని మెచ్చాకి విన్నవించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుధాకర్ రావు, జడ్పీటీసీ భారత లాలమ్మ(లావణ్య), ఎంపీపీ సున్నం లలిత, సర్పంచ్ పద్మ, పాఠశాల ప్రిన్సిపాల్ కవిత, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల స్పెషల్ ఆఫీసర్ కవిత, పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.