– జీవో 98ని సవరిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలి :
ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్సైజ్ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలనీ, అందులో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా విడుదల చేసిన జీవో 98ని సవరించి నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు కె వెంకట్, ఎం అడివయ్య గురువారం ఒక ప్రక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో ప్రకారం గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీ 10 శాతం ,ఎస్టీ 5 శాతం షాపులు కేటాయించాలని ప్రభుత్వం పేర్కొన్నట్టు తెలిపారు. దీనిలో ఎక్కడ కూడా వికలాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలని పేర్కొనలేదనీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వారికి ఐదు శాతం కేటాయించాలని విడుదల చేసిన జీవో 1కి ఇది భిన్నంగా ఉందని తెలిపారు. ఆ రకంగా మద్యం పాలసీ వికలాంగుల తీవ్ర అన్యాయం చేస్తున్నదని పేర్కొన్నారు.