వరదలతో గోదావరి బేసిన్‌ కళకళ ప్రాజెక్టుల్లో నిండుగా నీరు

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు కళకళ్లాడుతున్నాయి. నిండుకుండల్లా తయరయ్యాయి. ప్రధానంగా గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో వరద నీటి రాక అధికంగా ఉంటున్నది. గతంలో ఎన్నడూలేనివిధంగా వర్షాలు కురవడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో 10 రోజుల ముందు వరకు 54 శాతం లోటు వర్షపాతం కనిపించింది. శుక్రవారం నాటికి 65 శాతం అధిక వర్షపాతం నమోదైంది. గడిచిన 24 గంటల్లో 24 చోట్ల 60 శాతానికి పైగా, రెండు చోట్ల 20 నుంచి 59 శాతం, ఒక చోట సాధారణం, ఆరు చోట్ల లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలతో గోదావరి పరివాహక ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. గోదావరి ఉధతంగా ప్రవహిస్తోంది. రాష్ట్ర సాగునీటి ఆయకట్టు శాఖ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేసిన సమాచారం ప్రకారం గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వ, విడుదలకు సంబంధించి వివరాలు కింద ఇస్తున్నాం.
గోదావరి బేసిన్‌ వివరాలు
ప్రాజెక్టు పేరు నిల్వ(టీఎంసీ) ప్రస్తుతం(టీఎంసీ ఇన్‌ఫ్లో(క్యూసెక్‌) అవుట్‌ఫ్లో(క్యూసెక్‌)
సింగూర్‌ 29.917 24.27 14,546 0
నిజామ్‌సాగర్‌ 17.800 17.31 45,000 45,000
శ్రీరామ్‌సాగర్‌ 90.300 80.66 1,75,000 58,000
కడెం 7.600 4.36 15,544 25,517
శ్రీపాద ఎల్లంపల్లి 20.175 13.47 6,44,871 6,94,482
లక్ష్మి బ్యారేజీ(మేడిగడ్డ) 16.170 – 13,79,910 13,79,910
సమ్మక్కసాగర్‌ 6.940 – 14,47,560 14,47,560
సీతారామసాగర్‌ 36.570 49.50(అడుగులు) 13,48,091 13,48,091
భద్రాచలం 51.80 (అడుగులు) 51.80 (అడుగులు) 13,61,708 13,61,708