నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన

నవతెలంగాణ-గోవిందరావుపేట

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగ  మండలం లోని మచ్చాపూర్ గ్రామంలో గురువారం నూతన గ్రామపంచాయతీ నిర్మాణం  మచ్చాపూర్ సర్పంచ్ రేగూరి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టర్  కృష్ణ ఆదిత్య చేతుల మీదుగా “బంజరు దొడ్డి” పక్కన ఉన్న స్థలం నందు భవన నిర్మాణం కోసం శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో  సర్పంచ్ రేగురు రవీందర్ రెడ్డి  ఆధ్వర్యంలో  తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగ గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేసి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం చేయడం జరిగింది, ఉట్ల మంజుల,  రేగురి మోహన్ రెడ్డి,  దరిపెల్లి మహేందర్, సన్మానం చేసి బహుమతులు ఇవ్వడం జరిగింది, శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది, అందరి సహాయ సహకారాలతో తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నామని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని రవీందర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో  ములుగు జిల్లా గ్రంథాలయం చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, ఎంపిపి సూడి శ్రీనివాస్ రెడ్డి, జెడ్పిటిసి తుమ్మల హరిబాబు, ఎమ్మార్వో రాజ్ కుమార్ అల్లం, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, గోవిందరావుపేట మండల అధ్యక్షులు సూరపనేని సాయికుమార్ పంచాయతీ కార్యదర్శి స్వాతి,వార్డ్ నెంబర్ లెంకల రమేష్, పృథ్వీరాజ్ ఉట్ల ,పున్నం అజయ్ కుమార్, ఉప సర్పంచ్ బూరుగుల చంద్రమౌళి,ఆముదాల కుమారస్వామి, సిహెచ్ కుమారస్వామి, సీఏ భాగ్య, అల్వాల కనకయ్య,పసునూటి వినోద,సదానందం ఆముదాల, గట్ల యాదగిరి, వార్డ్ నెంబర్లు గ్రామపంచాయతీ సిబ్బంది మచ్చాపూర్ మహిళా సంఘాలు,  గ్రామ ప్రజలు యువకులు మీడియా మిత్రులు మండల నాయకులు తదితరులు ఈ నూతన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.