నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆదివారం ఉదయం పది గంటల నుంచి హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లోనిఅమిగోస్ ఐఏఎస్ అకాడమిలో సివిల్ సర్వీసెస్‌పై ఉచిత అవగాహన సదస్సును నిర్వహించనుంది. ఈ మేరకు ఆ అకాడమి అకడమిక్ డైరెక్టర్ మంజునాథ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సివిల్ సర్వీసెస్ సిలబస్, సన్నద్ధత, ప్రణాళిక, నోట్స్ మేకింగ్, సమయ పాలన వంటి అంశాలపై జాతీయ స్థాయి అధ్యాపకులు సమగ్ర అవ గాహన కల్పిస్తారని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు 040 35052121, 9000230735 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.