నీట్‌ విద్యార్థులకు ఉచిత కోచింగ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వచ్చే ఏడాదిలో జరిగే నీట్‌ పరీక్షకు సన్నద్దమవుతున్న విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ను అందిస్తున్నామని మెటామైండ్‌ నీట్‌ అకాడమి డైరెక్టర్‌ మనోజ్‌ కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నీట్‌లో ర్యాంక్‌ల సాధనే లక్ష్యంగా ప్రారంభిస్తున్న సూపర్‌ 30 బ్యాచ్‌కు మెరిట్‌ ఆధారంగా ఉచిత కోచింగ్‌ను ఇస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో సీటు రాని విద్యార్థులకు ర్యాంక్‌ సాధనే లక్ష్యంగా అనుభవజ్ఞులైన సీనియర్‌ అధ్యాపకులతో కోచింగ్‌, మెంటార్‌షిప్‌, టెస్ట్‌ సిరీస్‌ అందించనున్నట్టు వివరించారు. డాక్టర్‌ కావడమే లక్ష్యంగా ఉన్న ఇంటర్‌ బైపీసీ పూర్తి చేసిన బాల, బాలికలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని సూచించారు. ఉచిత రిజిస్ట్రేషన్‌ కోసం 7032264910 ఫోన్‌ నెంబర్‌ను సంప్రదించవచ్చని కోరారు.