కొండపర్తి లో ఉచిత వైద్య శిబిరం..

నవతెలంగాణ – ఐనవోలు
కొండపర్తి గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బిపి, షుగర్, రక్తపరీక్ష, ముత్రపరిక్షలు‌, కంటి చూపు పరిక్ష‌ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్కూరి‌ రాజమణి బెన్‌సన్‌‌, ఉపసర్పంచ్ కంజర్ల‌ సంపత్ రావు, వార్డు సభ్యులు మదాసు‌ రజినీ వేణు, గ్రామ కార్యదర్శి కొరివి లక్ష్మన్, మేస్త్రి‌ సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ముల విరనరసింహులు, లక్ష్మన్‌రావు‌ , డాక్టర్లు‌ ,పోస్టు‌ ఎల్లయ్య, మదాసు సునీల్,దుబాసి‌ రాజు, ప్రకాశం, రమేష్, రాంచందర్, రమేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.