నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టెక్ మహీంద్రా ఫౌండేషన్, స్మార్ట్-టీ సెంటర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బర్కత్‌పురలో గల ఠాకూర్ నివాస్‌లో స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ బేసిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసులతో పాటు రిఫ్రిజిరేటర్లు, ఎసీలు, వాషింగ్ మెషిన్లు, ఆఫ్టికల్ ఫైబర్ రిపేరింగ్ తదితర కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు స్మార్ట్ సెంటర్ మేనేజర్ కిరణ్‌తేజ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగు నెలల పాటు ప్రతి రోజు ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఒక బ్యాచ్, మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు మరో బ్యాచ్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకునే వారు కనీసం పదో తరగతి, ఆపై చదివి ఉండాలనీ, 18 ఏండ్ల నుంచి 30 ఏండ్ల లోపు వారు మాత్రమే అర్హులని తెలిపారు. కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన వారికి ఆయా సంస్థల్లో ప్లేస్‌మెంట్ కూడా ఇప్పిస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 79899 95635, 77999 10158, 77999 10159, 77999 10160 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.