నిరుద్యోగ యువతులకు ఉచిత శిక్షణ

 హాస్టల్‌, భోజన వసతి
 స్వామి రామానంద తీర్థ రూరల్‌ ఇన్‌ స్టిట్యూట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, హాస్టల్‌, భోజన వసతి కల్పిస్తున్నట్టు స్వామి రామానంద తీర్థ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మేధా చారిటబుల్‌ ట్రస్ట్‌ సహకారంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ యువతులకు టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ, జర్దోజి, బ్యాగ్స్‌ మేకింగ్‌లో ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించనున్నట్టు తెలిపారు. 8వ తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 25 ఏండ్లలో ఉన్న వారు ఈ నెల 29న ఉదయం 10 గంటలకు భవనగిరిలోని సంస్థ కార్యాలయంలో హాజరు కావాలని కోరారు. చదువు మధ్యలో ఉన్న అర్హులు కారని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు 91824 05414లో సంప్రదించాలని సూచించారు.